వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి వర్షపు నీరు

వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి  వర్షపు నీరు

KRNL: ఆదోనిలోని తిరుమల నగర్‌లో మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి వేంకటేశ్వర స్వామి దేవాలయంలోకి భారీగా వర్షం నీరు చేరింది. పేద ప్రజల పూరి గుడిసెల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై అక్రమ కట్టడాలు కట్టడం, డ్రైనేజీ కాలువలు ఆక్రమణకు గురికావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు మండిపడుతున్నారు.