హత్యాయత్నం కేసు.. 5 మంది అరెస్ట్
NGKL: కల్వకుర్తి సంజాపూర్ హత్యాయత్నం సంఘటనలో ఐదు మంది నిందితులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని గురువారం స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున, ఎస్సై మాధవ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వివాహేతర సంబంధం హత్యాయత్నానికి దారి తీసిందని తెలిపారు.