VIDEO: 'పాలెంపల్లెలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి'
కడప వెస్ట్ జోన్ 50వ డివిజన్‌లోని పాలెంపల్లె తదితర గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని సీపీఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నేతలతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, రోడ్లు, డ్రైనేజ్, వీధిలైట్లు, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. లేదంటే ఈనెల 10న కార్పొరేషన్ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.