మంత్రికి ఘనస్వాగతం పలికిన గజేందర్
ADB: ఉట్నూర్ మండలం గోండుగూడ గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రికి గజేందర్ ఘనస్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై ఆయనకు వివరించారు.