ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి: ఐటీడీఏ పీవో

ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి: ఐటీడీఏ పీవో

వరంగల్ జిల్లాలోని గిరిజన మహిళలు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా కోరారు. ఆర్ఎస్ఈటీఐ, టీటీడీసీ ఆధ్వర్యంలో హసన్పర్తిలో కుట్టుమిషన్, బ్యూటీషన్ కోర్సుల్లో 30 రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కనీస విద్యార్హత 10వ తరగతి, 18-45 ఏళ్లలోపు, ఆధార్, తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు.