గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలకు శ్రీకారం
AKP: కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లి గ్రామంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలకు బుధవారం శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గౌరీ పరమేశ్వరులను రామాలయంలో నిలిపి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ పెట్ల లింగన్నాయుడు తెలిపారు. ఉత్సవాలకు సూచనగా వరి దుబ్బు తీయడం జరిగిందన్నారు. వేడుకల్లో మహిళలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.