నల్లగా ఉందని భార్యను గెంటేసిన భర్త

నల్లగా ఉందని భార్యను గెంటేసిన భర్త

AP: పల్నాడు(D) వినుకొండలో లక్ష్మీ అనే మహిళ తన అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. ఆమెకు జూన్‌లో కోటేశ్వరరావుతో పెళ్లి జరిగింది. అయితే.. భార్య నల్లగా ఉందని భర్త, తనవల్ల అశుభాలు జరుగుతున్నాయని అత్తామామలు కలిసి కోడలిని ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో న్యాయం చేయాలని ఆమె నిరసన చేస్తోంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.