ఈ నెల 31 వరకు పత్తి కొనుగోలు బంద్
GDWL: వ్యవసాయ మార్కెట్ కమిటీ, అలంపూర్ పరిధిలోని శ్రీ వరసిద్ధి వినాయక కాటన్ మిల్ వద్ద పత్తి కొనుగోళ్లను 31 వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఎల్లస్వామి తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రైతులు తుపాను అనంతరం పత్తిని ఆరబెట్టుకుని, తేమశాతం 8% నుంచి 12%కి మించకుండా చూసుకొని తీసుకురావాలని సూచించారు.