నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

VZM: జిల్లాలో సోమవారం నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్డులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం సుమారు 5,78,137 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులందరికీ క్యూఆర్ కోడ్‌తో ఉన్న ఏటీఎం కార్డు సైజులో కార్డులను రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తారు.