నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన డీఎస్పీ
ఏలూరు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఇవాళ స్థానిక డీఎస్పీ శ్రావణ్ కుమార్ నిర్వహించారు. సర్కిల్ వారీగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న వాటిని త్వరగా పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.