ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లు మంజూరు: ఎంపీడీవో

ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లు మంజూరు: ఎంపీడీవో

ASR: కొయ్యూరు మండలంలో 7,501 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్దిదారులకు గాను, రూ.3,14,73,000 సొమ్ము మంజూరైనట్లు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈనెల 29వ తేదీన బ్యాంకుల నుంచి పెన్షన్ సొమ్మును విత్ డ్రా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. డిసెంబర్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం నుంచి లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేయాలని సూచించారు.