ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

అన్నమయ్య: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సోమవారం మదనపల్లెలోని సొసైటీ కాలనీ నందు వెరికోస్ వెయిన్స్(ఉబ్బిన సిరలు) సమస్యతో బాధపడుతున్న రోగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా కాళ్ల వాపు, దురద, మంటలు, రంగు మారటం వంటి సమస్యతో బాధపడుతున్న వారికి డాక్టర్ ప్రణీత్ చికిత్సలు అందించారు.