ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
NTR: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మైలవరంలో చోటుచేసుకుంది. కారు, బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న చాట్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, కారు రహదారి పక్కన ఉన్న ఓ దుకాణంలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురుకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మైలవరం ఆసుపత్రికి తరలించారు.