క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

W.G: తాడేపల్లిగూడెంలోని నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ నారాయణ ప్రీమియర్ లీగ్‌ను MLA బొలిశెట్టి శ్రీనివాస్ ఇవాళ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని, ఒత్తిడి నుండి ఉపశమనాన్ని ఇస్తాయన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు విద్యార్థులలో టీమ్ స్పిరిట్‌ను పెంచుతాయన్నారు.