బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గురురాజా రావు గెలుపు

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గురురాజా రావు గెలుపు

కర్నూల్: ఎమ్మిగనూరు న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యువ న్యాయవాది మాలపల్లి గురురాజా రావు గెలుపొందారు. గురువారం సాయంత్రం వరకు బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడి పదవికి గురురాజా రావు, సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర రెడ్డిల మధ్య పోటీ జరగ్గా గురురాజా రావు 8 ఓట్ల తేడాతో విజయ ఢంకా మోగించారు. ఇక ప్రధాన కార్యదర్శిగా బైరమ్ రఘురాం గెలిచారు.