ప్రియురాలి కూతురును హతమార్చిన ప్రియుడు
బెంగళూరులో విషాదకర ఘటన జరిగింది. భర్తతో విడిపోయిన శిల్పా అనే మహిళ తన కుమార్తెతో కలిసి తల్లితో ఉంటుంది. ఇటీవల తల్లి చనిపోవడంతో ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తితో ఆమె జీవిస్తుంది. అయితే తమ ప్రైవసీకి అడ్డొస్తుందని కూతురిని పంపించాలని శిల్పాతో ఆ వ్యక్తి గొడవ పడేవాడు. తాజాగా శిల్పాను ఉద్యోగానికి పంపించి కుమార్తెను చంపేశాడు. దీంతో శిల్పా ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు.