మహిళల పట్ల వివక్షత తగదు: పాడేరు సీఐ

మహిళల పట్ల వివక్షత తగదు: పాడేరు సీఐ

ASR: మహిళల రక్షణకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పాడేరు సీఐ డీ.దీనబంధు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, మహిళలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చిన్నారులు, స్త్రీల రక్షణకు పటిష్ఠ చట్టాలు ఉన్నాయని తెలిపారు.