VIDEO: బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

NRML: ఖానాపూర్ పట్టణంలోని జీపు అడ్డాలో గల బట్టల దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగిందని దుకాణ యజమాని తెలిపారు. స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరిన సిబ్బంది స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై రాహుల్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు.