విజయ డైరీని సందర్శించిన వాకిటి శ్రీహరి

KMR: జిల్లా కేంద్రంలోని విజయ డైరీని శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. పాల సేకరణలో విజయ డైరీ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పాడుబడ్డ భవనాలను తొలగించి ఆధునిక సదుపాయాలతో కొత్త నిర్మాణాలను చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో అధికారులతో చర్చించి అవసరమైన మార్పులు చేపట్టాలని సూచించారు.