కేంద్ర మంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
VSP: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటన ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.