రైల్వే ట్రాక్‌పై మృతదేహం కలకలం

రైల్వే ట్రాక్‌పై మృతదేహం కలకలం

VZM: నెల్లిమర్ల-విజయనగరం మధ్య రైల్వే ట్రాక్‌పై శనివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు మృతుడి వయసు 50-55 ఏళ్ల మధ్యలో ఉంటుందని, నీలి రంగు షార్ట్‌, తెలుపు రంగు ఫుల్‌ హాండ్స్‌ షర్ట్‌ ధరించినట్లు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు తమని సంప్రదించాలని సూచించారు.