మురుగు నీటి మధ్య ప్రజల జీవనం

మురుగు నీటి మధ్య ప్రజల జీవనం

KRNL: దేవనకొండ మండలం పల్లెదొడ్డి గ్రామంలో చిన్నపాటి వర్షానికే వీధుల్లో మురుగునీరు నిలుస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలతో దుర్వాసన, దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని సీసీ రోడ్డులు, కాలువలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.