అడవి నుంచి రాళ్లు తరలిస్తే కఠిన చర్యలు
MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట అటవీ ప్రాంతం నుంచి అనుమతి లేకుండా రాళ్లు, ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఆర్ఓ విద్యాసాగర్ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అటవీ సంపదను అక్రమంగా తరలించడం నేరమని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని, అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.