'ఈ ఏడాది నుంచి నవోదయ తరగతులు ప్రారంభం'

'ఈ ఏడాది నుంచి నవోదయ తరగతులు ప్రారంభం'

MBNR: బాలానగర్ మండలం పెద్దయ్య పల్లి శివారులో జవహర్ నవోదయ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆశించదగ్గ విషయమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అమర్నాథ్ గౌడ్ అన్నారు. నవోదయ పాఠశాల రావడానికి కృషి చేసిన డీకే అరుణకు కృతజ్ఞతలు చెబుతూ.. ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది నుంచి నవోదయ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.