VIDEO: స్వాతి నక్షత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ
NDL: ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో ఇవాళ స్వాతి నక్షత్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్సీ, విప్ పంచమర్తి అనురాధ ఎగువ, దిగువ అహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె సుదర్శన హోమంలో పాల్గొన్నారు. అర్చకులు ఆమెకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.