అక్రమ కేసులకు వ‍్యతిరేకంగా వైసీపీ నిరసన
విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం 9:30 గంటలకు వైసీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు. ప్రభుత్వ అక్రమ కేసులు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు ప్రకటించారు.