అగ్నికి ఆహుతైన నీలగిరి తోట
BHNG: రాజాపేట మండలం నమిల గ్రామంలో గల నాలుగు ఎకరాల నీలగిరి తోట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వల్లే ఈ అనర్ధం జరిగిందని బాధిత రైతులు వాపోయారు. సుమారు ముడు లక్షల రూపాయిలు విలువ చేసే ఈతోట కళ్లముందే బుగ్గిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే నష్టంపరిహారం అందించాలని రైతులు కోరారు.