ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై రేపు నిరసన

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై రేపు నిరసన

NLR: ఈనెల 2వ తేదీన ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ మధుసూదనరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఆర్సీ, ఐఆర్ బకాయిల సమస్యల పరిష్కారానికై నిరసన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నిరసనకు జిల్లాలోని ఉపాధ్యాయులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.