కాజీపేటలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి

కాజీపేటలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి

HNK: కాజీపేట పట్టణంలో శుక్రవారం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందారు. స్థానిక ఎస్సై లవన్ కుమార్ కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వృద్ధుడు మరణించినట్లుగా బాటసారులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మృతుడి వయసు దాదాపు 60 సంవత్సరాలు ఉంటుందని, వివరాలకు 8712685005 నెంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.