కుళ్ళిన స్థితిలో మృతదేహం లభ్యం

కుళ్ళిన స్థితిలో మృతదేహం లభ్యం

MNCL: తాండూర్ మండలం రేచిని రోడ్డురైల్వే స్టేషన్ సమీపంలో కుళ్ళిన స్థితిలో మగ వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ మంగళవారం తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. బ్లాక్ వైట్ లైనింగ్ గల షార్ట్, గోధుమ కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. తెలిసిన వారు పీఎస్‌కు సమాచారం అందించాలన్నారు.