ఉద్యమ నాయకుడు లక్ష్మణరావు గుండెపోటుతో కన్నుమూత

ఉద్యమ నాయకుడు  లక్ష్మణరావు గుండెపోటుతో కన్నుమూత

SKLM: వెనుకబడిన తరగతుల ఉద్యమ నాయకులు, ప్రముఖ న్యాయవాది చౌదరి లక్ష్మణరావు శుక్రవారం రాత్రి రాగోలులో గుండెపోటుతో మృతి చెందారు. ప్రజా సంఘాల ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన, జిల్లాలో జరుగుతున్న అన్యాయాలపై ఎప్పటికప్పుడు స్పందించేవారు. ఉపాధ్యాయ, ప్రాంతీయ సమస్యలపై పత్రికల్లో పలు వ్యాసాలు రాశారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.