'తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది'
NTR: మొంథా తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం విజయవాడ 62వ డివిజన్ కమ్యూనిటీ హాలులో తుఫాన్ బాధితులకు ప్రభుత్వం తరపున పంచదార, వంట నూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, 25 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ కష్ట సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలతోనే ఉందన్నారు.