జోరందుకున్న ఆశావాహుల చర్చ

RR: ఇటీవల హైకోర్టు పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో MPTCలు, ZPTCలు, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీల్లో ఉండాలనుకుంటున్న ఆశావాహులు అన్ని విధాలుగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ప్రకటనతో దాదాపుగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం గ్రామాల్లో జోరందుకుంది.