కొప్పునూర్ లో మంత్రి జూపల్లి ప్రచారం
WNP: చిన్నంబావి మండలం కొప్పునూర్ కాంగ్రెస్ మద్దతుదారు, సర్పంచ్ అభ్యర్థి బిచ్చన్న తరఫున సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచారం నిర్వహించారు. 116 ఎకరాల పెద్దనట్టు భూమిని ప్రజల ఆస్తిగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే గ్రామానికి రూ.7.5 కోట్లతో రోడ్డు, మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.