గ్రామ పాలన అధికారులకు క్లస్టర్ల కేటాయింపు

KMR: జిల్లాలో గ్రామ పాలన అధికారులుగా ఎంపికైన 363 మందికి మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి క్లస్టర్లు కేటాయించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గతంలో వీఆర్వో, వీఆర్ఎలుగా పని చేసిన వారిని ప్రత్యేక పరీక్ష ద్వారా రెవెన్యూలో నియమించారన్నారు. ఎంపికైన వారు సకాలంలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.