'అకాల వర్షాలతో అరటి రైతులకు భారీ నష్టం'

'అకాల వర్షాలతో అరటి రైతులకు భారీ నష్టం'

అన్నమయ్య: అకాల వర్షాలు, బలమైన గాలివానలతో ఓబులవారిపల్లి మండలంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వై.కోట, ఎద్దులవారిపల్లి గ్రామాల్లో బుధవారం రాత్రి వీచిన గాలులకు అరటి చెట్లు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ మేరకు వ్యవసాయ కార్మిక సంఘం రైల్వే కోడూరు ఏరియా కార్యదర్శి జయ రామయ్య దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.