అధికారులకు తలనొప్పిగా మారిన ఇళ్ళ నిర్మాణం

అధికారులకు తలనొప్పిగా మారిన ఇళ్ళ నిర్మాణం

MNCL: జన్నారం మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అధికారులకు తలనొప్పిగా మారింది. మండలానికి ప్రభుత్వం 757 ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించింది. ప్రస్తుతం 20 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అటవీ ఆంక్షలతో ఇసుక లభించకపోవడంతో చేపట్టిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో ఇందిరమ్మ ఇళ్లు ఎప్పటికీ పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.