VIDEO: గుండ్లపల్లి చెరువు వద్ద మొసలి ప్రత్యక్షం
PLD: నకరికల్లు మండలంలోని గుండ్లపల్లి గ్రామం సమీపంలోని చెరువు వద్ద మొసలి కనిపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పెద్దలు మొసలిని తాళ్లతో బంధించి అటవి శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికులు చెరువు పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.