ఇంట్లో పేలిన రిఫ్రిజిరేటర్
SKLM: ఒక ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలిన ఘటన ఇచ్చాపురం ముత్యాలమ్మపేటలో చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. బాధితుడు డి.లక్ష్మణ్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదవశాత్తూ రిఫ్రిజిరేటర్ పేలడంతో బీరువా, ఏసీ, వంట సామగ్రి దగ్ధమయ్యాయన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.