ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్ కన్నెర్ర

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్ కన్నెర్ర

ప్రకాశం: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కన్నెర్ర చేశారు. ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణలో భాగంగా పిఓలు, ఏపీఓలకు జరిగిన మొదటి విడత శిక్షణకు 59మంది గైర్హాజరు కావడంతో వారికి కలెక్టర్ నోటీసులు పంపించారు. ఓ ఉద్యోగి మద్యం సేవించి శిక్షణకు హాజరుకాగా సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.