VIDEO: బొలెరో ఢీకొని రైతుకు గాయాలు
అన్నమయ్య: ములకలచెరువు మండలానికి చెందిన శ్రీరాములు (57) అనే రైతు గురువారం తన స్కూటీపై పొలం వద్దకు వెళ్తుండగా, వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్ ద్వారా బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.