వాయిదాలకు హాజరు కాకుండా తిరుగుతున్న నిందితుడి అరెస్ట్
MNCL: విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ల దొంగతనం కేసులో కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న కిష్టంపేట గ్రామానికి చెందిన జీ. బాలకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల నిమిత్తం నిందితుడిని లక్షెట్టిపేట జైలుకు తరలించినట్లు తాండూరు SI ప్రసాదావు ఓ ప్రకటనలో తెలిపారు.