'ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతా'
సూర్యాపేట: తుంగతుర్తి మండలం దేవునిగుట్టతండా గ్రామ పంచాయతీలో నూతన సర్పంచ్ స్వాతి ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, త్రాగునీరు, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పారదర్శకత పరిపాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పని చేస్తామని హామీ ఇచ్చారు.