మడగూడలో అకాల వర్షం - వడగళ్ల బీభత్సం
MHBD: జిల్లా గంగారం, కొత్తగూడ మండలాల్లో నిన్న రాత్రి ఒక్కసారిగా మారిన వాతావరణంతో మడగూడలో వడగళ్ల బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో పాటు వడగళ్ల వాన కురవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వడగళ్ల వాన కారణంగా పంటలు దెబ్బతిన్నాయని, ఆర్థిక నష్టం భారీగా ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.