VIDEO: చంద్రశేఖరపురంలో అదుపుతప్పి బోల్తాపడ్డ లారీ
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ఉప్పలపాడు గ్రామం వద్ద మంగళవారం మధ్యాహ్నం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ కథనం ప్రకారం.. ఒక ఫార్చునర్ కారు రాంగ్ రూట్‌లో అడ్డు రావడంతో ఆ కారును తప్పించబోయి లారీ బోల్తా పడిందన్నారు. అనంతరం లారీని క్రేన్ సహాయంతో బయటకు తీశారు.