అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కడప: సిద్ధవటం మండలం భాకరాపేట ICDS సెక్టారులో 3 అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని కడప అర్బన్ ICDS CDPO శోభారాణి పేర్కొన్నారు. భాకరాపేట (BC-A), మాధవరం-1(BC-B), మహబూబ్నగర్ (EWS), కేంద్రాలలో ఈ ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఐసీడీఎస్ కార్యాలయంలో సమర్పించాలని సీడీపీఓ సూచించారు.