కార్తీక దీపాల మంటల్లో బాలిక మృతి

కార్తీక దీపాల మంటల్లో బాలిక మృతి

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో కార్తీక పౌర్ణమి వేళ దుర్ఘటన జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్ఎల్ నగర వాసి మధుసూదన్ రెడ్డి కూతురు సాయి నేహారెడ్డి (7) ఇంట్లో దీపాలు వెలిగించే సమయంలో తన దుస్తులకు మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సైనిక్‌పూరి అంకురా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది.