VIDEO: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ
NRML: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మూలా నక్షత్రం శుభముహూర్తం సందర్భంగా జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అక్షరాభ్యాసం మండపంలోకి చేరారు. ఆలయ అర్చకుల చేత తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.