ఎల్లారెడ్డి మండలంలో విద్యార్థుల 94.09 శాతం పదవ తరగతిలో ఉత్తీర్ణత

ఎల్లారెడ్డి మండలంలో విద్యార్థుల  94.09 శాతం పదవ తరగతిలో ఉత్తీర్ణత

NZB: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పదవ తరగతి లో 94.09 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి రాజులు తెలిపారు. 728 మంది విద్యార్థులకుగాను 685 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారని చెప్పారు. ఎల్లారెడ్డి మండల టాపర్‌గా జీవదాన్ హైస్కూల్‌కు చెందిన హిమగిరి 576/600, రెండవ టాపర్‌గా నబిల నూరిన్ 572/600 మార్కులు సాధించారని పేర్కొన్నారు.