ఆయేషా కేసు.. విచారణ వాయిదా
AP: ఆయేషా తల్లిదండ్రుల పిటిషన్‌పై విజయవాడ సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ పునర్విచారణ నివేదిక కాపీలను తమకు అప్పగించాలని పిటిషన్ వేశారు. అయితే, నివేదిక కాపీలను పిటిషనర్లకు అందజేస్తామని సీబీఐ తెలిపింది. దీంతో నివేదికను పరిశీలించాక అభ్యంతరాలు చెబుతామని ఆయేషా తల్లిదండ్రులు పేర్కొన్నారు. కోర్టు విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.